Devineni Uma: రాజభవనాల రక్షణ కోసం ఏకంగా ప్రత్యేక చట్టమా?: జగన్ పై దేవినేని ఉమ పైర్

Devineni Uma Fires On Jagan About Security Expenses

  • కిమ్ ను మించిన పెత్తందారీ జగన్
  • ఇంట్లో ఉంటేనే 986 మందితో సెక్యూరిటీ
  • బయటకు వెళితే అంతకు మూడు రెట్ల భద్రత

కిమ్ ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి జగన్ రెడ్డిది, అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ ఏపీ మాజీ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. తన రాజభవనాల రక్షణ కోసం ఏకంగా ప్రత్యేక చట్టమే చేశాడంటూ తీవ్రంగా విమర్శించారు. సొంత ప్యాలస్ ల రక్షణకు వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంట్లో ఉన్నపుడు ఏకంగా 986 మందితో సెక్యూరిటీ పెట్టుకున్నాడని, బయటకు అడుగు పెడితే దానికి మూడు రెట్లు అధికంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపించారు. దారిపొడవునా పరదాలు కప్పి, అడుగడుగుకో పోలీస్ ను నిలబెట్టి రాష్ట్రంలో పర్యటించే వాడని తీవ్ర విమర్శలు చేశారు 

తన కుటుంబం, తన రాజభవనాల రక్షణకోసం ప్రత్యేక చట్టం చేయడంతో పాటు తన నివాస పరిసరాల్లో 48 చెక్ పోస్టులు, రిక్టాట్రబుల్ గేట్లు, బూమ్ బారియర్లు, టైర్ కిల్లర్లు, బోలార్డ్స్ లాంటి విస్తు గొలుపే అనవసర చర్యలు తీసుకున్నారని విమర్శించారు. తన తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో జరిగిన అత్యాచారం, అరాచకాలను మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల భద్రత గాలికి వదిలేసి వారి సొమ్ముతో విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేమిటి? అంటూ ఉమ విమర్శించారు.

  • Loading...

More Telugu News