Gopi Krishna: అమెరికాలో బాపట్ల వాసి గోపీకృష్ణను కాల్చి చంపిన నిందితుడి అరెస్ట్

US Police arrests accused in killing of Gopi Krishna

  • 8 నెలల క్రితమే అమెరికాకు గోపీకృష్ణ
  • డల్లాస్‌లోని ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో ఉద్యోగం
  • ఈ నెల 21న గోపీపై నిందితుడి కాల్పులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • నిందితుడి ప్రవర్తన విచిత్రంగా ఉందన్న పోలీసులు

అమెరికాలో బాపట్ల జిల్లా యాజిలికి చెందిన దాసరి గోపీకృష్ణ(32)ను కాల్చి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల క్రితమే అమెరికా వెళ్లిన గోపీకృష్ణ డల్లాస్‌లోని ఓ కన్వీనియెన్స్ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 21న స్టోర్‌కు వచ్చిన 21 ఏళ్ల నిందితుడు డవోంటా మాథిస్.. గోపీకృష్ణపై కాల్పులు జరిపి తనకు కావాల్సిన వస్తువును పట్టుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

మాథిస్‌పై తొలుత దోపిడీ అభియోగాలు మోపగా, గోపీకృష్ణ మృతితో హత్యానేరం మోపారు. నిందితుడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందని పోలీసులు తెలిపారు. గోపీపై కాల్పులు జరపడానికి ముందు రోజు వాకో నగరంలోనూ అతడు కాల్పులు జరిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. ముహమ్మద్ హుస్సేన్ (60) అనే వృద్ధుడిపై పలుమార్లు కాల్పులు జరిపాడని, తీవ్రంగా గాయపడిన హుస్సేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News