Gold: మలద్వారంలో బంగారం... శంషాబాద్ విమానాశ్రయంలో రూ.59 లక్షల బంగారం పట్టివేత

Police seizes 59 lakh worth gold

  • అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికుడు
  • అనుమానం వచ్చి ప్రశ్నించిన పోలీసులు
  • 806 గ్రాముల బంగారాన్ని గుర్తించిన పోలీసులు
  • కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు తన మలద్వారంలో పసిడిని దాచుకున్నాడు. సదరు ప్రయాణికుడు అబుదాబి నుంచి వచ్చాడు. విమానాశ్రయంలో దిగిన అతనిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతనిని ప్రశ్నించారు. ప్రయాణికుడి నుంచి దాదాపు రూ.59 లక్షల విలువ చేసే 806 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. దీనిని అతను అక్రమంగా తీసుకువస్తున్నట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు.

Gold
Hyderabad
  • Loading...

More Telugu News