Animal Facts: ఆస్ట్రిచ్ పక్షి మెదడు పరిమాణం ఎంతో తెలుసా?.. ఆశ్చర్యపరుస్తున్న నిజం
మనిషితో పాటు, మన చుట్టూ ఈ భూప్రపంచంలో ఎన్నో జంతు చరాలు జీవిస్తున్నాయి. జంతువుల జీవన పరిస్థితులు, వాటి శరీర ఆకృతి, పనితీరు ఆధారంగా జంతువులకు వేటికవే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. జంతువుల ప్రత్యేకతల గురించి చాలా మందికి తెలియని చాలా విశేషాలు దాగి ఉన్నాయి. ఉదాహరణగా చూస్తే ఆస్ట్రిచ్ పక్షి కన్ను దాని మెదడు కంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ విధంగా జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.
మనిషితో పాటు ఈ భూమ్మీద నివసించే పలు జంతువులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి కొన్ని జంతువుల వింతలు-విశేషాల సమాహారంతో పాఠకుల కోసం ఏపీ7ఏఎం ఒక వీడియోను రూపొందించింది. మరెందుకు ఆలస్యం వీడియోను పూర్తిగా వీక్షించి ఆశ్చర్యపరిచే కొన్ని జంతు విశేషాలు మీరూ తెలుసుకోండి.