Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలింగనం

Komatireddy meets Bandi Sanjay

  • పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపిన కోమటిరెడ్డి
  • నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ
  • భారత్ మాల స్థానంలో కొత్త విధానం రాబోతుందన్న మంత్రి
  • ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలవాలని ఆదేశించారన్న కోమటిరెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ఢిల్లీలో కలిశారు. సంజయ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఇరువురు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... భారత్ మాల స్థానంలో కొత్త విధానం రాబోతుందన్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి, తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. హైదరాబాద్ - విజయవాడ హైవేను 6 లైన్లుగా మార్చాలని కోరామన్నారు.

ఉప్పల్ - ఘట్‌కేసర్ మధ్య రోడ్డు 40 శాతమే పూర్తయిందన్నారు. ఈ విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లగా... త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని గడ్కరీ ఆదేశించారన్నారు. రేపు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, భూపేష్ యాదవ్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 

Bandi Sanjay
Komatireddy Venkat Reddy
Telangana
BJP
Congress
  • Loading...

More Telugu News