Revanth Reddy: ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

Revanth Reddy meets Rajnath Singh

  • భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట ఎంపీలు
  • రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని విజ్ఞప్తి
  • కొన్ని జిల్లాల్లో సైనిక్ స్కూల్స్ పెంపు కోసం విజ్ఞప్తి

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెంట కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితర ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు. అలాగే, కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ కోసం రక్షణ శాఖ భూముల అప్పగింతపై కూడా విజ్ఞప్తి చేశారు.

ప్యారడైజ్ నుంచి బోయినపల్లి, సుచిత్ర రహదారిలో రోడ్డు చిన్నగా ఉండి, ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు. అలాగే, కొన్ని జిల్లాల్లో సైనిక్ స్కూల్స్ పెంపు కోసం విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 6.15 గంటలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి కలవనున్నారు.

Revanth Reddy
Congress
Rajnath Singh
BJP
  • Loading...

More Telugu News