Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు

Telugu producers met AP Deputy CM Pawan Kalyan
  • విజయవాడ క్యాంపు కార్యాలయంలో భేటీ
  • పవన్ కు చిత్ర పరిశ్రమ తరఫున అభినందనలు తెలిపిన నిర్మాతలు
  • సమావేశంలో పాల్గొన్న ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్
టాలీవుడ్ నిర్మాతల బృందం నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసింది. అల్లు అరవింద్, దిల్ రాజు, ఏఎం రత్నం, అశ్వనీదత్, యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సురేశ్ బాబు, సుప్రియ, బన్నీ వాస్, ఎన్వీ ప్రసాద్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ ఈ మధ్యాహ్నం విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికి క్యాబినెట్ సమావేశం ముగించుకుని వచ్చిన పవన్ కల్యాణ్... సినీ నిర్మాతలతో భేటీ అయ్యారు. 

మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా పాల్గొన్నారు. 

పిఠాపురంలో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కల్యాణ్ ను నిర్మాతలు అభినందించారు. మంత్రిగానూ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan
Deputy CM
Producers
Tollywood
Andhra Pradesh

More Telugu News