Putta Madhu: మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేత పుట్టా మధు విమర్శలు

Putta Madhu fires at Minister Sridhar Babu

  • ఓటుకు రూ.2 వేలు ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచారని విమర్శ
  • మంథని అభివృద్ధిని పక్కకు పెట్టి డబ్బు సంపాదనపై పడ్డారని ఆరోపణ
  • కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం... దగా అన్న పుట్టా మధు

మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పుట్టా మధు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు రూ.2 వేలు ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇసుక మాఫియా గురించి ఎన్నో నీతులు వల్లించి... ఇప్పుడు ఆయనే దందాకు తెరలేపారన్నారు. మంథని అభివృద్ధిని పక్కన పెట్టి సంపాదనపై పడ్డారని విమర్శించారు. ఇసుక తరలింపుపై గ్రీన్ ట్రైబ్యునల్ ఆంక్షలు పెట్టినప్పటికీ మంథనిలో మాత్రం అమలు కావడం లేదన్నారు. మంథనిలో సహజవనరుల ధ్వంసాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం... దగా అన్నారు. ఈ ఆరు నెలల పాలన మరోసారి దానిని రుజువు చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహజవనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. యథేచ్చగా ఇసుక తరలిపోతుంటే చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా ఒక లారీకి పర్మిషన్ ఉంటే వంద లారీలలో మట్టి, ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు శ్రీధర్ బాబు, ఆయన కుటుంబం జేబుల్లోకి వెళ్తోందన్నారు.

More Telugu News