Kishan Reddy: తెలుగులో ప్రమాణం చేసిన కిషన్‌ రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు

Kishan Reddy and Ram Mohan Naidu take oath in Telugu

  • ప్రారంభ‌మైన 18వ లోక్‌సభ తొలి సమావేశాలు
  • సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌
  • తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం  
  • అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం
  • ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం

18వ లోక్‌సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ వార‌ణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం మొద‌లవుతుంది. ఈ నెల 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.

ఇక‌ సభ ప్రారంభం కాగానే కేరళలోని వయనాడ్‌ స్థానానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన వయనాడ్‌ సీటును వదులుకొని రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగేందుకు నిర్ణ‌యించుకున్నారు. అందుకే రాహుల్ గాంధీ ఇవాళ వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News