Amaravati Farmers: అమరావతి రైతుల కృతజ్ఞతా యాత్ర

Amaravathi Farmers started Padayatra To Tirumala
  • తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన మహిళలు
  • వెంకటపాలెంలోని వెంకటేశ్వర ఆలయం నుంచి తిరుమలకు యాత్ర
  • పాదయాత్రను ప్రారంభించిన తాడికొండ ఎమ్మెల్యే

అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేలా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పనులు ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి యాత్ర మొదలు పెట్టారు.

సోమవారం ఉదయం రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కృతజ్ఞతా యాత్ర ప్రారంభించారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర మొదలుపెట్టారు. అమరావతి రైతుల యాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. కాగా, రైతులు చేపట్టిన ఈ పాదయాత్ర సుమారు 20 రోజుల పాటు కొనసాగనుందని, తిరుమల చేరుకున్నాక రైతులు వెంకన్నకు మొక్కులు చెల్లించుకుంటారని ఎమ్మెల్యే చెప్పారు.

  • Loading...

More Telugu News