AP Cabinet: రేపు తొలిసారి సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్

AP Cabinet will meet tomorrow

  • ఏపీలో కూటమి ప్రభుత్వం
  • జూన్ 24 ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం
  • మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. రేపు (జూన్ 24) ఉదయం 10 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గానికి దిశానిర్దేశం చేయనున్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పాలన తీరుతెన్నులు ఎలా ఉండాలన్న దానిపై సూచనలు అందించనున్నారు. హామీల అమలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా, 8 కీలక శాఖలకు సంబంధించి శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించనుంది.

AP Cabinet
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News