Anantha Venkatrami Reddy: అనంతపురం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన రిటైర్డ్ ఎస్పీ

Retired SP Bala Narasimhareddy complains against Anantapur Urban former MLA Venkatramireddy to CM Chandrababu

  • అనంత వెంకట్రామిరెడ్డి అక్రమాలపై విచారణ జరిపించాలన్న బాలనరసింహారెడ్డి
  • కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని వెల్లడి
  • సోదరులతో కలిసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ

అనంతపురం అర్బన్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ బాలనరసింహారెడ్డి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అనంత వెంకట్రామిరెడ్డి అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎంను కోరారు. కేంద్రం నిధులను వెంకట్రామిరెడ్డి దుర్వినియోగం చేశారని, ఆస్తి పన్ను ఎగ్గొట్టారని తెలిపారు. సోదరులతో కలిసి వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని బాలనరసింహారెడ్డి ఆరోపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. 

కాగా, అనంత వెంకట్రామిరెడ్డి ఇటీవలి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ చేతిలో 23,023 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

More Telugu News