Dasari Gopi Krishna: 8 నెలల క్రితమే అమెరికాకు బాపట్ల యువకుడు.. దుండగుడి కాల్పుల్లో మృతి

Bapatla Man Died In US Shooting

  • ఆర్కాన్సాస్‌లో ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న గోపీకృష్ణ
  • దుండగుడి కాల్పుల్లో తీవ్ర గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి
  • యాజిలిలో విషాద ఛాయలు

అమెరికాలో కాల్పులకు మరో తెలుగు యువకుడు బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. 

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కాన్సాస్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం గోపి విధుల్లో ఉండగా తుపాకితో వచ్చిన దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. అతడు కుప్పకూలడంతో దుండగుడు లోపలికి దూకి తనకు కావాల్సిన వస్తువులను తీసుకెళ్లిపోయాడు. అక్కడున్న సీసీటీవీల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

తీవ్రంగా గాయపడిన గోపీని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నాడు. అతడి మృతి విషయం తెలిసి యాజలిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

More Telugu News