Adiseshagiri Rao: తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపును మహేశ్ బాబు ముందే ఊహించాడు: ఆదిశేషగిరిరావు

AdiSeshagiri Rao on Mahesh babu predicting Congress win in Telangana


సూపర్ స్టార్ కృష్ట, ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు సుదీర్ఘ సినీ, రాజకీయ అనుభవం ఉన్న విషయం తెలిసిందే. అయితే, హీరోగా అపార ప్రజాభిమానం సంపాదించుకున్న మహేశ్ బాబు రాజకీయ అభిరుచి గురించి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను పరిశీలిస్తాడు కానీ పెద్దగా ఇంట్రెస్టు లేదని అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ ప్రసంగాలను చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని తనతో మహేశ్ బాబు అన్నాడని ఆదిశేషగిరి రావు అన్నారు. 

రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆదిశేషగిరిరావు అన్నారు. నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం, రాజకీయ ప్రసంగాలు, మీడియా మేనేజ్‌మెంట్, స్లోగన్లు.. వంటి విషయాల్లో రేవంత్ నిర్వహణ చాలా బాగుందన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అందరినీ కలుపుకుని ముందుకు వెళుతున్నారని ప్రశించారు. అయితే, ఈ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ కారణంగా పరిపాలనలో రేవంత్ మార్కు ఇంకా కనబడలేదని చెప్పారు. ఆయన ఆలోచనలు ఇంకా కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఎన్నికల హామీలు, ఇతర అంశాల అమలులో రేవంత్ పనితీరు తదుపరి ఆరు నెలల్లో చూడాలని, ఈ విషయంలో సీఎం విజయంసాధిస్తారనే అనుకుంటున్నానని అన్నారు.

More Telugu News