IAS transfers: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 18 మంది ఐఏఎస్‌ల బదిలీ!
- రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
- 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
- విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు కలెక్టర్లను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
- శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం తెరలేపింది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లకు నియమించింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డిలకు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరోవైపు షగిలి షన్మోహన్‌కు కాకినాడ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇఛ్చారు. బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషాకు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం కలెక్టర్ దినేశ్ కుమార్‌కు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగు ఇచ్చారు.
గత ప్రభుత్వంలో అవకాశం దక్కని నాగరాణి, అంబేద్కర్‌లు కూడా ఈ మారు కలెక్టర్లుగా నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా ప్రశాంతిని ప్రభుత్వం నియమించింది. తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలను నియమించడం, ఈ జిల్లాలన్నీ భౌగోళికంగా వరుసగా ఉండటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.
పేరు | ప్రస్తుత జిల్లా | బదిలీ అయిన జిల్లా |
---|---|---|
ఎస్. నాగలక్ష్మి | విజయనగరం | గుంటూరు |
ఎం. వేణుగోపాల్ రెడ్డి | గుంటూరు | జీఏడీలో రిపోర్టు చేయాలి |
ఎ. మల్లికార్జున | విశాఖపట్నం | జీఏడీలో రిపోర్టు చేయాలి |
ఏఎస్ దినేశ్‌కుమార్ | ప్రకాశం | అల్లూరి సీతారామరాజు |
ఎం. విజయ సునీత | అల్లూరి సీతారామరాజు | జీఏడీలో రిపోర్టు చేయాలి |
సగిలి షన్మోహన్ | చిత్తూరు | కాకినాడ |
జె.నివాస్ | కాకినాడ | జీఏడీలో రిపోర్టు చేయాలి |
కె.వెట్రిసెల్వి | స్త్రీ శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ | ఏలూరు |
ప్రసన్న వెంకటేశ్ | ఏలూరు | జీఏడీలో రిపోర్టు చేయాలి |
పి. ప్రశాంతి | వ్యవసాయ శాఖ డైరెక్టర్ | తూర్పు గోదావరి |
కె.మాధవీలత | తూర్పు గోదావరి | జీఏడీలో రిపోర్టు చేయాలి |
డాక్టర్. అంబేద్కర్ | మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ | విజయనగరం |
సి. నాగరాణి | సాంకేతిక విద్య డైరెక్టర్ | పశ్చిమగోదావరి |
సుమిత్ కుమార్ | పశ్చిమగోదావరి | చిత్తూరు |
సృజన గుమ్మళ్ల | కర్నూలు | ఎన్టీఆర్ జిల్లా |
ఎస్. ఢిల్లీరావు | ఎన్టీఆర్ జిల్లా | జీఏడీలో రిపోర్టు చేయాలి |
ఎ. తమీమ్ అన్సారియా | శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ | ప్రకాశం |
పి.రంజిత్ బాషా | బాపట్ల | కర్నూలు |
(బాపట్ల జేసీకి కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు) |