Vaishnavi: అమరావతి కోసం రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని... బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సీఎం చంద్రబాబు

Medical student Vaishnavi doantes Rs 25 lakhs to Amaravati

  • ఇవాళ సీఎం చంద్రబాబును కలిసిన మెడికల్ స్టూడెంట్ వైష్ణవి
  • పొలం అమ్మి విరాళం
  • పోలవరంకు రూ.1 లక్ష విరాళం
  • వైష్ణవిని అభినందించిన సీఎం చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ పట్టాలెక్కింది. తాజాగా, రాజధాని అమరావతి నిర్మాణానికి వైద్య విద్యార్థిని వైష్ణవి రూ.25 లక్షల విరాళం అందించింది. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు కోసం మరో రూ.1 లక్ష విరాళం ఇచ్చింది. పొలం అమ్మి విరాళం ఇచ్చిన ఆ వైద్య విద్యార్థిని నిర్ణయం పట్ల సీఎం చంద్రబాబు ముగ్ధులయ్యారు. వైష్ణవిని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. రాజధాని అమరావతికి వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఇవాళ ఆమె తన తండ్రితో కలిసి వచ్చి సీఎం చంద్రబాబుకు విరాళం తాలూకు చెక్కులు అందించింది.

ముదినేపల్లికి చెందిన వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు, ఆమె తండ్రి అంబుల మనోజ్ ను సిఎం చంద్రబాబు అభినందించారు. 

More Telugu News