TTD: ఆ వార్తలు నమ్మొద్దు.. ధరలు తగ్గించలేదు: టీటీడీ

TTD says do not trust false news

  • ఏపీలో కొత్త ప్రభుత్వం
  • ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, లడ్డూల ధర తగ్గించినట్టు వార్తలు
  • రూ.300 టికెట్ రూ.200కి... రూ.50 లడ్డూ రూ.25కి తగ్గించినట్టు ప్రచారం
  • వాస్తవం లేదన్న టీటీడీ  

తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ధర రూ.300 నుంచి రూ.200కి... లడ్డూ ధర రూ.50 నుంచి రూ.25కి తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. 

దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. ధరలు తగ్గించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ధర రూ.300, లడ్డూ ధర రూ.50లో ఎలాంటి మార్పు లేదని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారీలను నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. భక్తులను మోసం చేసే దళారీలపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. టీటీడీ వెబ్ సైట్ లోనూ, వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల ద్వారా మాత్రమే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందే వీలుంటుందని టీటీడీ వివరించింది.

TTD
Special Entry Darshan
Laddu
Tirumala
Social Media
  • Loading...

More Telugu News