Kinjarapu Ram Mohan Naidu: అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేశ్ ను కలిసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Union minister Ram Mohan Naidu met AP minister Nara Lokesh at assembly

  • నేటితో ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • ఏపీ అసెంబ్లీ లాబీలో దర్శనమిచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
  • ఏపీ మంత్రి నారా లోకేశ్ తో మాటామంతి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. కాగా, ముగింపు రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏపీ అసెంబ్లీకి విచ్చేశారు. అసెంబ్లీ లాబీలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ను ఆయన కలిశారు. 

టీడీపీ యువనేతలు ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం కాసేపు మాట్లాడుకున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ విమానాశ్రయాలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడ్ని నారా లోకేశ్ ఆరా తీశారు. పెండింగ్ విమానాశ్రయాలను రెండేళ్ల లోపు పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు బదులిచ్చారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రామ్మోహన్ నాయుడ్ని లోకేశ్ కోరారు.

More Telugu News