Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రెండోరోజు ముగ్గురు సభ్యుల ప్రమాణ స్వీకారం

AP Assembly Session Second Day

  • సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
  • దైవసాక్షిగా ప్రమాణం చేసిన వనమాడి, పితాని, జీవీ ఆంజనేయులు
  • బాధ్యతలు స్వీకరించనున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ 16వ శాసన సభ తొలి సమావేశాలు రెండో రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత శుక్రవారం ప్రమాణం చేయడం కుదరని మిగతా సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వనమాడి వెంకటేశ్వరరావు శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు.

ఆ తర్వాత ఆచంట ఎమ్మెల్యేగా ఎన్నికైన పితాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవీ ఆంజనేయులు వరుసగా ప్రమాణం చేశారు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్ పదవి కోసం అయ్యన్నపాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మరికాసేపట్లో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించనున్నారు. ఆపై స్పీకర్ పదవీ బాధ్యతలు చేపడతారు.

Andhra Pradesh
AP Assembly Session
MLAs Swearing
AP Speaker
Ayyanna Patrudu
  • Loading...

More Telugu News