Nijjar: ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ సంతాపం... స్పందించిన భారత్

India criticises Canadian parliament observing one minute silence in memory of Nijjar

  • గత ఏడాది హత్యకు గురైన ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్
  • కెనడా ఎంపీలంతా లేచి నిలబడి సంతాపం ప్రకటన  
  • అలాంటి చర్యలను తాము వ్యతిరేకిస్తామని భారత్ వ్యాఖ్య

గత ఏడాది హత్యకు గురైన ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించింది. కెనడా ఎంపీలంతా లేచి నిలబడి దేశ పార్లమెంట్‌లో సంతాపం ప్రకటించారు.  2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్ హత్య జరిగింది. ఈ ఘటన వెనుక భారత్ ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేయడంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు వచ్చాయి. ట్రూడో ఆరోపణలను భారత్ అప్పుడే ఖండించింది.

అయితే, తాజాగా నిజ్జర్‌కు పార్లమెంట్ వేదికగా సంతాపం ప్రకటించడంపై భారత్ మరోసారి స్పందించింది.  అయితే, వేర్పాటువాదాన్ని, హింసను సమర్థించే రాజకీయాలకు చోటు కల్పించే చర్యలను తాము సాధారణంగా వ్యతిరేకిస్తామని భారత్ స్పష్టం చేసింది. ఒక దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్ పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి హత్యకు దేశ పార్లమెంట్‌లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే తొలిసారి అని నెటిజన్లు స్పందిస్తున్నారు.

  • Loading...

More Telugu News