Vinod Kumar: బొగ్గు గనుల వేలానికి బీఆర్ఎస్ మద్దతు పలకలేదు!: వినోద్ కుమార్

BRS Vinod Kumar on coal mines aucion
  • బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ బిల్లు పెడితే... బీజేపీ ఆర్డినెన్స్ తెచ్చిందన్న వినోద్ కుమార్
  • 2011లో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని వెల్లడి
  • భట్టివిక్రమార్క వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు

బొగ్గు గనుల వేలంపై బిల్లు పెట్టింది కాంగ్రెస్ అయితే... ఆర్డినెన్స్ తెచ్చింది బీజేపీ అని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. బొగ్గు గనుల వేలం బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పడం సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... 2011లో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని... అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీయే ఉందని గుర్తు చేశారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లో ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందన్నారు.

ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సెక్షన్ 17 కింద యాక్షన్ లేకుండా బొగ్గు గనులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క కేంద్రం వద్దకు వెళ్లాలని... బొగ్గు గని వేలంను ఆపాలని హితవు పలికారు. బొగ్గు గనుల వేలానికి తాము మద్దతిచ్చామనే మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిని చంపేయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలను గెలిపించారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News