Nara Lokesh: ఇది నా జీవితంలో మరపురాని ఘట్టం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh tweets on his first time entry into AP Assembly

  • గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్
  • 2024 ఎన్నికల్లో 90 వేల పైచిలుకు మెజారిటీతో విజయం
  • రాష్ట్ర క్యాబినెట్ లో చోటు
  • మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని వెల్లడి
  • ఓడిన చోటే రికార్డు స్థాయి మెజారిటీతో అసెంబ్లీకి పంపించారని వివరణ

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. 

"మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇవాళ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం నా జీవితంలో మరపురాని ఘట్టం. ఐదేళ్ల క్రితం ఓడిపోయిన చోటే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగిస్తాను. రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో కొలువైన ప్రజా ప్రభుత్వం ఐదు కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News