Nabha Natesh: 'స్వయంభూ'తో నభా బిజీ అయ్యేనా?

Nabha Special

  • విడుదలకు సిద్ధమవుతున్న 'స్వయంభూ'
  • నిఖిల్ జోడి కడుతున్న నభా నటేశ్
  • చాలా గ్యాప్ తరువాత ఆమె చేసిన సినిమా ఇది 
  • మళ్లీ బిజీ అవుతాననే నమ్మకంతో ఉన్న బ్యూటీ


నభా నటేశ్ .. హాట్ బ్యూటీగా ఒక్కసారిగా తెరపైకి దూసుకొచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అందాలు ఆరబోస్తూ కుర్రకారు నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా తరువాత ఆమె జోరు మరింత పెరగడం ఖాయమని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆ తరువాత ఆమె చకచకా సినిమాలు చేస్తూ వెళ్లింది. 

అయితే అవకాశాలు వచ్చినంత వేగంగా సక్సెస్ రాలేదు. స్టార్ హీరోలతోనే సినిమాలు చేసినప్పటికీ, అవి వర్కౌట్ కాలేదు. కథాకథనాల పరంగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా మాత్రం ఆమె న్యాయం చేస్తూనే వచ్చింది. అలాంటి నభా చాలా కాలంగా మళ్లీ తెరపై కనిపించలేదు. కరోనా సమయంలో ఆమెకి ఏదో ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వచ్చాయి.

ఆ గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలు తగ్గడం కోసమే ఆమె ఇంత గ్యాప్ తీసుకుందని అంటారు. అలాంటి నభా, నిఖిల్ జోడిగా 'స్వయంభూ' సినిమా చేస్తోంది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సినిమా, ఇప్పటికే అందరిలో అంచనాలు పెంచిన సినిమా. అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని నభా భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి. 

  • Loading...

More Telugu News