Airtel: కేవలం 1 గంట వ్యాలిడిటీ.. ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్

The new data plan costs Rs 9 and offers unlimited data but validity in just one hour

  • రూ.9లకే ఏకంగా 10జీబీ డేటా
  • గంటలోనే ముగిసిపోనున్న వ్యాలిడిటీ
  • పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్‌ చేసుకునే యూజర్లకు అద్భుతమైన ఆఫర్

ఇటీవలే రెండు తక్కువ రీఛార్జ్‌ ప్లాన్లతో ఎక్కువ వ్యాలిడిటీని అందించిన దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో సరికొత్త, ఊహించని ప్లాన్‌ను ప్రకటించింది. తక్కువ రీఛార్జ్ ప్లాన్ల ట్రెండ్‌ను కొనసాగిస్తూ కేవలం రూ.9 తో ప్రత్యేక డేటా ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో ఏకంగా 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 గంటలోనే ముగిసిపోతుంది. ఈ ప్లాన్ ఎఫ్‌యూపీ (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితి 10జీబీగా ఉందని, ఆ తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుందని ఎయిర్‌టెల్ వివరించింది. కాబట్టి యూజర్లు ఎంత డేటా వినియోగించుకోవాలనుకున్నా గంట వ్యవధిలోనే వాడుకోవాల్సి ఉంటుంది.

కాగా పెద్ద ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడనుంది. తాత్కాలిక డేటా బూస్ట్ అవసరమైనవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా టెలికం కంపెనీల ప్లాన్లు పరిశీలిస్తే 10జీబీ అదనపు డేటా కావాలనుకుంటే దాదాపు రూ.100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో రూ.9 రీఛార్జ్ చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది.

కాగా రూ.9తో 10 జీబీ లభిస్తుండగా.. రూ.18 రీఛార్జ్‌తో యూజర్లు 20జీబీ డేటాను పొందవచ్చు. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో ఈ ప్లాన్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులో ఉంది.

  • Loading...

More Telugu News