Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

Balka Suman arrested in Hyderabad

  • నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి
  • పోచారం ఇంటి ముందు నిరసన తెలిపిన బాల్క సుమన్
  • పోచారం ఇంట్లోకి గేట్లు తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం
  • అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు

మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిముందు ఆందోళన చేసిన కారణంగా, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పోచారం, ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

పోచారం తన ఇంట్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలో బాల్క సుమన్, మరికొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రిని కలవాలంటూ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా లోనికి వెళ్లే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఆయనను కోర్టుకు తరలిస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.

More Telugu News