Pankaj Tripathi: స్ట్రీమింగ్ కి రెడీగా 'మీర్జాపూర్ 3' .. రసిక దుగల్ పైనే అందరి దృష్టి!

Mirzapur3 WebSeries Update

  • విశేషమైన ఆదరణ పొందిన 'మీర్జాపూర్'
  • సెకండ్ సీజన్ లో హింస పెరిగిందంటూ విమర్శలు 
  • వచ్చేనెల 5 నుంచి సీజన్ 3 స్ట్రీమింగ్ 
  • రసిక దుగల్ పాత్ర నిడివి పెంచారంటూ టాక్  


శుక్రవారం వస్తుందంటే చాలు, కొత్త కొత్త వెబ్ సిరీస్ లు .. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చి వాలుతున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కంటెంట్ ను చూడటానికి ఎక్కువమంది ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆల్రెడీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులను కొట్టేసిన వెబ్ సిరీస్ లు, సిరీస్ లుగా మళ్లీ మళ్లీ తెరపైకి వచ్చేస్తున్నాయి. అలా వస్తున్న మరో వెబ్ సిరీస్ గా 'మీర్జాపురం' కనిపిస్తోంది. 

2018లో తొలి సీజన్ గా 9 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్, ఆడియన్స్ కి కనెక్ట్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. 2020లో 10 ఎపిసోడ్స్ తో సీజన్ పలకరించింది. అభ్యంతరకరమైన సంభాషణలు .. దృశ్యాలు అక్కడక్కడా ఉన్నాయనే విమర్శలు వచ్చినప్పటికీ, ఫస్టు సీజన్ ను మించిన విజయాన్ని సాధించింది. ఇక జులై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సీజన్ 3 సిద్ధమవుతోంది. 

ఈ సిరీస్ లో మున్నా భయ్యా .. లడ్డూ భయ్యా .. ఖాలిన్ భయ్యా పాత్రల తరువాత ఎక్కువ ఆదరణ పొందిన మరో పాత్రగా 'బీనా త్రిపాఠి' పాత్రనే చెప్పుకోవాలి. ఖాలిన్ భయ్యాకి రెండో భార్యగా ఆమె ఈ సిరీస్ లో కనిపిస్తుంది. ఆ పాత్రలో ఆమె ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఆ పాత్రకి లభిస్తున్న క్రేజ్ కారణంగానే, మూడో సీజన్ లో ఆమె పాత్ర నిడివిని మరింత పెంచినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి రసిక దుగల్ తన పాత్రను ఏ స్థాయిలో పరిగెత్తిస్తుందో.

More Telugu News