UGC NET: రూ. ఐదొందలకే అమ్మేశారట.. యూజీసీ నెట్ పేపర్ లీక్ లో సంచలనం

UGC NET Paper Sold For 500 In DarkNet And Telegram APP Says Central Minister Dharmendra pradhan

  • డార్క్ నెట్, టెలిగ్రామ్ యాప్ లో నెట్ పేపర్ షేర్ అయినట్లు గుర్తింపు
  • పేపర్ లీక్ నిజమని నిర్ధారణ అయ్యాకే పరీక్ష రద్దు చేశామన్న కేంద్ర మంత్రి 
  • బీహార్ పోలీసులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నామని వెల్లడి   

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్ పరీక్షలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని అంగీకరించారు. అందుకే పరీక్ష రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. డార్క్ నెట్ లో, టెలిగ్రామ్ లో పేపర్ షేరింగ్ అయినట్లు గుర్తించామన్నారు. దీంతో మరో మార్గంలేక పరీక్షను రద్దు చేసినట్లు వివరించారు. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీకి సంబంధించి మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉందని చెప్పారు. కాగా, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పరీక్షలో పేపర్ లీక్ కావడం ఓ సంచలనం కాగా.. లీకైన పేపర్ ను కేవలం రూ.500 లకే అమ్మారని, రూ.5 వేలకూ కొందరు కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఏటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష ద్వారా సమర్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లుగా ఎంపిక చేస్తారు. దీనికోసం పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. పేపర్ లీక్ జరిగిందని పలుచోట్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. తొలుత ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది.. అయితే, తర్వాత లీక్ నిజమేనని అంగీకరిస్తూ పరీక్ష రద్దు చేసింది.

‘నెట్’ పేపర్ ను దుండగులు డార్క్ నెట్ లో రూ.500 ల నుంచి రూ.5 వేల వరకు పలువురికి అమ్మినట్లు తెలుస్తోంది. డార్క్ నెట్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫాం టెలిగ్రామ్ లోనూ నెట్ పేపర్ పలువురు షేర్ చేసుకున్నారని అధికారులు గుర్తించారు.

  • Loading...

More Telugu News