Naga Babu: అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వం అన్నారు.. నాగ‌బాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్‌!

Naga Babu Interesting Tweet goes Viral on Social Media

 
 
 


జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఆ పార్టీ నేత నాగ‌బాబు చేసిన ట్వీట్ ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. "జ‌న‌సేన పార్టీ పెట్టి ప‌దేళ్లు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావ్‌. ప్ర‌జ‌లు నిన్ను న‌మ్మలేదు. అసెంబ్లీ గేటు కూడా తాక‌లేవు.. ఇలా వాగిన నోళ్ల‌‌న్నీ మూత‌ప‌డేలా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ బంప‌ర్ విక్ట‌రీ సాధించారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టారు" అని అర్థం వ‌చ్చేలా నాగ‌బాబు ట్వీట్ చేశారు. 

ఇక కొద్దిసేప‌టి క్రితం ప‌వ‌న్ అసెంబ్లీలో కూడా అడుగుపెట్టారు. అలాగే ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం కూడా చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌ర్వాత ప‌వ‌న్ ప్ర‌మాణం చేశారు. దీంతో ఈ క్ష‌ణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నామంటూ జ‌న‌సైనికులు ఎమోష‌న‌ల్ అవుతున్నారు.

More Telugu News