Chandrababu: ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

AP CM Chandrababu And Deputy CM Pawan Kalyan Swearing
  • ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • తొలుత సీఎం, తర్వాత డిప్యూటీ సీఎం ప్రమాణం
  • సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణం చేశారు. మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు.
Chandrababu
Pawan Kalyan
AP Assembly Session
Swearing-in Ceremony
Protem Spekar
Gorantla Butchaiah Chowdary

More Telugu News