Manda Krishna Madiga: పద్ధతి మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు: మంద కృష్ణ మాదిగ హెచ్చరిక

Manda Krishna Madiga warning to Revanth Reddy

  • పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు కాంగ్రెస్ ఒక్క సీటూ ఇవ్వలేదని విమర్శ
  • మాదిగలకు చేసిన మోసానికి కచ్చితంగా బుద్ధి చెబుతామన్న మంద కృష్ణ
  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మెజార్టీ సీట్లు ఎందుకు గెలవలేదని ప్రశ్న

పద్ధతి మార్చుకోకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ ఉండదని... ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండరని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. మాదిగలకు చేసిన మోసానికి కచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతామన్నారు.

కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే వారి పార్టీ ఉండదు... సీఎంగా రేవంత్ రెడ్డి ఉండరని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని... అయినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు ఎందుకు గెలవలేదో ఆలోచించుకోవాలని సూచించారు.

More Telugu News