VV Lakshminarayana: పవన్ హయాంలో వికేంద్రీకరణ సాకారం అవుతుందని ఆశిస్తున్నా: లక్ష్మీనారాయణ

VV Lakshminarayana wishes AP minister Pawan Kalyan

  • ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్
  • శుభాకాంక్షలు తెలియజేసిన జై భారత్ నేషనల్ పార్టీ అధినేత
  • ఇకపై గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని ఆకాంక్ష

సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కల్యాణ్ హయాంలో... రాజ్యాంగం 73వ సవరణలో పేర్కొన్న విధంగా వికేంద్రీకరణ సాకారం అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం... ఇకపై 29 అంశాలపై గ్రామ పంచాయతీలకు అధికారం లభిస్తుందని, గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష ఆర్థిక కేటాయింపులు జరుగుతాయని ఆకాంక్షిస్తున్నట్టు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

More Telugu News