Reels: ఉరి వేసుకుని రీల్స్ చేసే యత్నం.. బిగుసుకుని యువకుడి మృతి

Young man dies after reel went wrong in Warangal

  • వరంగల్ జిల్లా నర్సంపేటలో ఘటన
  • ప్రమాదవశాత్తు బిగుసుకున్న ఉరి
  • కుమారుడి మృతిపై తల్లి అనుమానం
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

రీల్స్ పిచ్చికి మరో యువకుడు బలయ్యాడు. మెడకు ఉరి బిగించుకుని రీల్స్ చేసే క్రమంలో అది మెడకు బిగుసుకుపోవడంతో మరణించాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిందీ విషాదం. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కందకట్ల అజయ్ (23) హోటల్‌లో పనిచేస్తుంటాడు. రీల్స్ చేసి వాటిని తన ఖాతాలో షేర్ చేసే అలవాటున్న అజయ్ రెండ్రోజుల క్రితం మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు.

అక్కడ ఉరివేసుకుంటున్నట్టుగా వీడియో చిత్రీకరించాలని అనుకున్నాడు. దూలానికి ఉరి ఏర్పాటు చేసి ఫోన్‌ను ఫ్రిడ్జ్‌పై పెట్టాడు. వీడియో చిత్రీకరించే సమయంలో ఉరి నిజంగానే మెడకు బిగుసుకుపోయింది. నిన్న ఉదయం ఉరికి వేలాడుతున్న అజయ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అజయ్ మృతిపై తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Reels
Instagram
Warangal
Narsampet
  • Loading...

More Telugu News