Puranapanda Srinivas: 'జయ జయోస్తు', 'నారసింహో.. ఉగ్రసింహో ' గ్రంథాలపై చంద్రబాబు, పవన్ ఫొటోలు

Chandrababu and Pawan photos on Puranapanda Books

  • ప్రముఖ రచయిత పురాణపండ చేతిలో రూపుదిద్దుకున్న గ్రంథాలు
  • ఈ గ్రంథాలను సమర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య
  • విజయవాడలో ఇటీవల పురాణపండతో కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశం
  • ఆగస్టు 15న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతుల పంపిణీ
  • సిద్ధమవుతున్న 25 వేల ప్రతులు

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ‘జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం’ సంస్థాపక కార్యదర్శి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘జయ జయోస్తు’, ‘నారసింహో.. ఉగ్రసింహో’ గ్రంథాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు ముద్రించనున్నారు. ఇటీవల విజయవాడలో పురాణపండతో సమావేశమైన కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఈ మేరకు సూచించినట్టు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబునాయుడు సమర్థవంతమైన పాలన అందించాలని కోరుకుంటూ కిమ్స్ ఆసుపత్రి చైర్మన్, మాజీ శాసనసభ్యుడు బొల్లినేని కృష్ణయ్య పైన పేర్కొన్న రెండు మహత్తర గ్రంథాలను బెజవాడ కనకదుర్గమ్మ చెంతన ఉంచి, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో ఆవిష్కరింపజేశారు. పురాణపండ సంకలనంలో రూపుదిద్దుకున్న ఈ గ్రంథాలు వేలాదిమంది భక్తులను ఆకర్షిస్తున్నాయి.  

ఆగస్టు 15న ప్రభుత్వ ఉద్యోగులకు పంపిణీ
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, బీజేపీ, టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ఈ రెండు గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 25 వేల ప్రతులు సిద్ధం చేస్తున్నారు. అలాగే, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలోనూ వీటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు టీడీపీ శ్రేణులు ముందుకొచ్చాయి. ఈ రెండు గ్రంథాలను సమర్పించింది బొల్లినేని కృష్ణయ్యే కావడం గమనార్హం. 

More Telugu News