RGIA: ఇంజెన్‌లో మంటలు.. హైదరాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Malaysian airlines plane emergency landing in Shamshabad airport

  • శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్‌కు బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం
  • టేకాఫ్ అయిన 15 నిమిషాలకు ఇంజెన్‌లో మంటలు
  • అగ్నికీలలు గుర్తించిన వెంటనే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • విమానం క్షేమంగా ల్యాండవడంతో తప్పిన ప్రమాదం
  • ఘటన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు

హైదరాబాద్ నుంచి మలేషియాకు బయలుదేరిన ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మలేషియన్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్‌కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ లాండింగ్‌కు అనుమతి కోరాడు. ఆ తరువాత కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. ఏటీసీ అనుమతి లభించగానే అత్యవసరంగా ల్యాండయ్యింది. ఘటన సమయంలో విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, విమానం క్షేమంగా కిందకు దిగడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటన వెనక కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News