Russia: చేతులు కలిపిన కిమ్, పుతిన్.. కీలక ఒప్పందంపై సంతకాలు

A strategic pact signed by the leaders of Russia and North Korea on Wednesday

  • బాహ్య దేశం దూకుడు ప్రదర్శిస్తే ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయం
  • దురాక్రమణ సమయాల్లో పరస్పర సహకారానికి అంగీకారం
  • సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం సంతకాలు చేసిన కిమ్, పుతిన్

ఉత్తరకొరియా, రష్యా మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. రక్షణ విషయంలో పరస్పర సహకారం అందించుకోవాలని అంగీకారం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒప్పందంపై బుధవారం సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగమైన పరస్పర రక్షణ నిబంధన కింద ఏదైనా ఒక బాహ్య దేశం తమ పట్ల దూకుడుగా వ్యవహరిస్తే తిప్పికొట్టేందుకు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు.

ఈ మేరకు ఇరు దేశాల మధ్య డీల్ కుదిరిందని రష్యా వార్తా సంస్థ టీఏఎస్‌ఎస్ పేర్కొంది. దురాక్రమణ సమయాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని అధినేతలు నిర్ణయించారని తెలిపింది. ఈ మేరకు ఒప్పందంపై బుధవారం సంతకాలు చేశారని వివరించింది.

కాగా ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌‌లో ఇరు దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. ఆర్థిక, సైనిక సహకార పరిధిని మరింత పెంచుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఇరుదేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరు దేశాధినేతలు సంతకం చేశారు. కాగా ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధాలు అవసరమనే వార్తల నేపథ్యంలో ఉత్తరకొరియాతో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం.

  • Loading...

More Telugu News