YS Sharmila: రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్ షర్మిల
![YS Sharmila pay tributes to Ramojirao](https://imgd.ap7am.com/thumbnail/cr-20240619tn66729e9f3d5f1.jpg)
రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు అర్ధాంగి రమాదేవిని, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.