Text Books: ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP Govt decides free distribution of text books for Inter students

  • ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు
  • నోడల్ ఆఫీసర్ నియామకం
  • తెలుగు అకాడమీ నుంచి టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులు సరఫరా

ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. 

ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ లలో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్ బుక్ లు పంపిణీ చేయనున్నారు. 

సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ను ఈ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టెక్ట్స్ బుక్స్ తో పాటు నోట్ బుక్ లు,  బ్యాగ్ లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు.

More Telugu News