Uppal Stadium: ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లు రూ.1.64 కోట్లు ఒకేసారి చెల్లింపు

Uppal Stadium power bill paid

  • 2015 నుంచి కోటిన్నరకు పైగా విద్యుత్ బిల్లు
  • నాలుగైదు వాయిదాల్లో చెల్లించుదామని భావించిన హెచ్‌సీఏ
  • హెచ్‌సీఏ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని ఒకేసారి చెల్లించినట్లు చెప్పిన అధ్యక్షుడు

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లు రూ.1.64 కోట్లు చెల్లించారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. 2015 నుంచి దాదాపు రూ.1.64 కోట్ల కరెంట్ బిల్లు బకాయిపడగా ఐపీఎల్ సమయంలో మొదట రూ.15 లక్షలు చెల్లించినట్లు చెప్పారు. మిగతా మొత్తాన్ని నాలుగైదు వాయిదాల్లో చెల్లించుదామని భావించామన్నారు. అయితే హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని మొత్తం ఒకేసారి చెల్లించినట్లు చెప్పారు. రూ.1 కోటి 48 లక్షల రూపాయల పైమొత్తాన్ని చెక్ రూపంలో టీఎన్ఎస్‌పీడీసీఎల్ సీఎండీకి అందించారు.

ఐపీఎల్ సందర్భంగా విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కరెంట్ కట్ చేసి అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Uppal Stadium
Hyderabad
Cricket
HCA
  • Loading...

More Telugu News