12th PRC: ఏపీ 12వ వేతన సవరణ సంఘం కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా
- గతేడాది ఉద్యోగ సంఘాలతో వైసీపీ ప్రభుత్వం చర్చలు
- 12వ పీఆర్సీ ప్రకటన
- కమిషనర్ గా మన్మోహన్ సింగ్ నియామకం
- కమిషన్ ప్రకటించారే గానీ, కమిషన్ లో ఉద్యోగులను నియమించలేదన్న మన్మోహన్
- ఉద్యోగులు లేకపోవడంతో పని ప్రారంభించలేకపోయామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిషనర్ మన్మోహన్ సింగ్ నేడు తన పదవికి రాజీనామా చేశారు. ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాల రీత్యా తనను రిలీవ్ చేయాలని మన్మోహన్ సింగ్ కోరారు.
2023లో తనను పీఆర్సీ కమిషనర్ గా నియమించారని, అయితే కమిషన్ ప్రకటించారే గానీ, కమిషన్ కు ఉద్యోగులను కేటాయించలేదని తెలిపారు. ఉద్యోగులు లేనందున కమిషన్ పని ప్రారంభించలేకపోయిందని వివరణ ఇచ్చారు.
నాడు ఉద్యోగ సంఘాలతో చర్చలు, వారి డిమాండ్ల మేరకు వైసీపీ ప్రభుత్వం 12వ పీఆర్సీ ప్రకటించింది. ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఖరారు, నూతన పే స్కేల్ అమలు తదితర అంశాలపై ఈ కమిషన్ సిఫారసు చేయాల్సి ఉంది. ఇప్పుడు కమిషనర్ గా మన్మోహన్ సింగ్ రాజీనామాతో కమిషన్ ఉనికే ప్రశ్నార్థకమైంది.