NCERT: ఇంగ్లీష్ మీడియంపై ఆసక్తి ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదు: ఎన్‌సీఈఆర్టీ చీఫ్

 Fascination with English medium schools no less than suicide says NCERT chief
  • ఇంగ్లీష్ మీడియం వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్య
  • ఇంగ్లీష్ మీడియం వైపు ఆసక్తి అంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనన్న దినేశ్
  • ఇంగ్లీష్‌తో నింపడం అంటే పిల్లలను మూలాలు, సంస్కృతి నుంచి దూరం చేయడమేనని వ్యాఖ్య

ఇంగ్లీష్ మీడియాపై తల్లిదండ్రుల మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్‌సీఈఆర్టీ చీఫ్ దినేశ్ ప్రసాద్ సక్లానీ అన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... చాలాచోట్ల సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఇలా ఆసక్తి చూపడం అంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయన్నారు.

కంటెంట్ మొత్తాన్ని ఇంగ్లీష్‌లో నింపడం వల్ల పిల్లలను వారి మూలాలు, సంస్కృతి నుంచి దూరం చేయడమే అవుతుందన్నారు. దీంతో పాటు విజ్ఞానంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాష ఆధారిత బోధన ఉంటేనే మూలాలను సరిగ్గా అర్థం చేసుకోగలమన్నారు. ఇది వివిధ భాషలను నేర్చుకోవడానికి దోహదం చేస్తుందని తెలిపారు. భాష అంటే శక్తిని ఇచ్చేలా ఉండాలి తప్ప కోల్పోయేలా ఉండకూడదన్నారు.

  • Loading...

More Telugu News