Dammalapati Srinivas: ఏపీ అడ్వొకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం

Dammalapati Srinivas appointed as AP Advocate General

  • ఏపీలో కొత్త ప్రభుత్వం
  • నూతన ఏజీగా దమ్మాలపాటిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • గతంలో 2014 నుంచి 2019 వరకు ఏజీగా వ్యవహరించిన దమ్మాలపాటి

ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దమ్మాలపాటి శ్రీనివాస్ కు అడ్వొకేట్ జనరల్ పదవి కొత్త కాదు. ఆయన గతంలో 2014 నుంచి 2019 వరకు ఏజీగా పనిచేశారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఏజీ పదవి దమ్మాలపాటికే దక్కుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 

గత ప్రభుత్వ హయాంలో దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన కుటుంబం పైనా రాజధాని భూముల విషయంలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులను ఆయనే వాదించుకున్నారు. 

అంతేకాదు, టీడీపీ ముఖ్య నేతలపై కేసులను కూడా హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాసే వాదించారు. కొన్ని పెండింగ్ కేసుల్లోనూ ఆయనే వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొత్త అడ్వొకేట్ జనరల్ గా దమ్మాలపాటి నియామకం పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

More Telugu News