Jagan: జగన్ పులివెందుల పర్యటన వాయిదా... ఎందుకంటే...!

Jagan postpones Pulivendula visit
  • రేపు పులివెందుల వెళ్లాలని భావించిన మాజీ సీఎం జగన్
  • ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • నిర్ణయం మార్చుకున్న జగన్
  • ఈ నెల 20న తాడేపల్లిలో వైసీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులతో కీలక సమావేశం

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. ఆయన రేపు పులివెందుల వెళ్లి, 21వ తేదీన తాడేపల్లి తిరిగి రావాలని తొలుత భావించారు. అయితే, ఏపీ అసెంబ్లీ సమావేశాలను 24వ తేదీ నుంచి 21కి మార్చడంతో, జగన్ పర్యటనలోనూ మార్పులు తప్పలేదు. ఈ నెల 20న తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులతో పార్టీ అధినేత జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో, అసెంబ్లీ సమావేశాలపైనా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News