G Jagadish Reddy: విచారణ అధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదు: జగదీశ్ రెడ్డి

Jagadeesh Reddy on inquiry commission

  • వివక్ష, ముందస్తు అభిప్రాయాలు లేకుండా విచారణ అధికారి విచారణ చేయాలన్న మాజీ మంత్రి
  • విద్యుత్ ఒప్పందాలపై కమిషన్ ముందే పలు విషయాలు వెల్లడించిందని వ్యాఖ్య
  • గత ప్రభుత్వానికి ఎలాంటి చెడు ఉద్దేశం లేదని ప్రజలకు అర్థమైందని కామెంట్  

వివక్ష, ముందస్తు అభిప్రాయాలు లేకుండా ఏ విచారణ అధికారి అయినా విచారణ జరపాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విచారణ కమిషన్ పైన ఆయన స్పందించారు. విచారణ అధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదని పేర్కొన్నారు. కానీ విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ ముందే పలు విషయాలను వెల్లడించిందన్నారు. విద్యుత్ ఒప్పందాల్లో తమ ప్రభుత్వానికి ఎలాంటి చెడు ఉద్దేశం లేదని ప్రజలకు అర్థమైందని తెలిపారు.

తెలంగాణలోని విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకే ఒప్పందాలు చేసుకున్నామని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వస్తే అంధకారమవుతుందని నాటి సమైక్యవాదులు భయపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ హయాంలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చామన్నారు.

G Jagadish Reddy
BRS
KCR
Telangana
  • Loading...

More Telugu News