Air Ports: దేశవ్యాప్తంగా 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

Bomb Threat to 40 airports

  • పాట్నా, కోయంబత్తూరు, జయపుర, వడోదర తదితర విమానాశ్రయాలకు బెదిరింపు
  • విమానాశ్రయాల్లో బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు
  • విమానాశ్రయాల్లో భద్రత పెంపు

దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పాట్నా, కోయంబత్తూరు, జయపుర, వడోదర సహా పలు విమానాశ్రయాలకు బెదిరింపు వచ్చింది. కోయంబత్తూరు విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.30 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ఇతర విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అన్ని విమానాశ్రయాలలోనూ తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదు. బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలగలేదని అధికారులు తెలిపారు.

Air Ports
Bomb Threat
India
  • Loading...

More Telugu News