Chandrababu: సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కు ఎదురెళ్లి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు

CM Chandrababu welcomes Dy CM Pawan Kalyan in AP Secretariat
  • రేపు పదవీ బాధ్యతలు చేపట్టనున్న డిప్యూటీ సీఎం పవన్
  • సచివాలయంలో తన చాంబర్ పరిశీలించడానికి వచ్చిన వైనం
  • సీఎం చంద్రబాబుతో సమావేశం
  • ఏపీ అధికారిక చిహ్నానికి వన్నె తెచ్చారంటూ చంద్రబాబును కొనియాడిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు తొలిసారిగా సచివాలయంలోని చంద్రబాబు చాంబర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడం విశేషం. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇక చంద్రబాబు చాంబర్ లోని ఏపీ అధికారిక చిహ్నాన్ని చూపిస్తూ ... ఆ గుర్తుకు వన్నె తీసుకువచ్చారంటూ చంద్రబాబును పవన్ కొనియాడారు. అందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చంద్రబాబు, పవన్ భేటీ కావడం ఇదే ప్రథమం. 

కాగా, పవన్ కల్యాణ్ చాంబర్ కు వచ్చిన సందర్భంగా ఆయనను పలువురు అధికారులు కలిశారు. పవన్ తనకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై ఆరా తీశారు. పవన్ తో సచివాలయానికి వచ్చిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా ఉన్నారు.
Chandrababu
Pawan Kalyan
AP Secretariat
TDP-JanaSena-BJP Alliance
Amaravati
Andhra Pradesh

More Telugu News