Car Fall: కారు రివర్స్ చేస్తూ లోయలో పడ్డ యువతి.. వీడియో ఇదిగో!

woman died after she reversed her car off a cliff

  • మహారాష్ట్రలో కారు ప్రమాదం.. యువతి మృతి
  • డ్రైవింగ్ రాకున్నా కారు నడపడంతో యాక్సిడెంట్
  • క్లచ్ నొక్కి స్లో చెయ్యాలంటూ స్నేహితుడు చెబుతుండగానే ఘోరం

డ్రైవింగ్ రాకున్నా సరదాగా కారు నడిపిన ఓ యువతి ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. రివర్స్ చేస్తుండగా కారు కంట్రోల్ తప్పి కొండ పై నుంచి కిందపడింది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా యువతి అక్కడికక్కడే చనిపోయింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఉన్న సులిభంజాన్ హిల్స్ లో చోటుచేసుకుందీ దారుణం. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన యువతి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.

ఔరంగాబాద్ కు చెందిన శ్వేతా దీపక్ సురవాసె (23) తన స్నేహితులతో కలిసి కారులో సులిభంజాన్ హిల్స్ కు సోమవారం విహారయాత్రకు వెళ్లింది. కొండపైకి చేరుకున్న తర్వాత అక్కడ ఫొటోలు దిగుతూ సంతోషంగా గడిపిన శ్వేత.. తాను కారు నడుపుతుండగా వీడియో తీయాలని కోరింది. డ్రైవింగ్ రాకున్నా కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా రివర్స్ చేసింది. స్నేహితుడు సూచనలు చేస్తుంటే నెమ్మదిగా వెనక్కి వెళ్లింది. కొండ అంచుకు వెళుతుండగా శ్వేత పొరపాటున ఎక్స్ లేటర్ మరింత రైజ్ చేసింది.

దీంతో కారు వేగం పుంజుకుంది. వీడియో తీస్తూ కారు పక్కనే నడుస్తున్న యువకుడు శ్వేతను హెచ్చరిస్తూ క్లచ్ నొక్కాలని చెబుతుండగానే ఘోరం జరిగింది. కొండ అంచుకు చేరుకున్న కారు దాదాపు 300 అడుగుల పై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజునుజ్జుగా మారింది. డ్రైవింగ్ సీటులో ఉన్న శ్వేత స్పాట్ లోనే చనిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News