Chandramohan Reddy Somireddy: ఈవీఎంలపై జగన్ పోస్ట్.. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్!
![Chandramohan Reddy Somireddy Counter on YS Jagan Post on EVMs](https://imgd.ap7am.com/thumbnail/cr-20240618tn6671312d578d8.jpg)
- అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి జగన్ ఇంకా కోలుకోలేదన్న టీడీపీ నేత
- ఏపీ ఎలాన్ మస్క్‌లా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా
- గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా? అంటూ విమర్శ
- ఇకనైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ సోమిరెడ్డి సూచన
బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి వైఎస్ జగన్ ఇంకా కోలుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలాన్ మస్క్‌లా జగన్ మాట్లాడుతున్నారని చురకలంటించారు. "గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో ఓసారి గుర్తు చేసుకోవాలి. పరనింద, ఆత్మస్తుతి మాని ఇకనైనా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని" సోమిరెడ్డి సూచించారు.