Women Stabbed: హైదరాబాద్ లో యువతిపై కత్తితో దాడి

Women Stabbed By man In Hyderabad

  • ఛత్రినాకలో దారుణం.. 
  • ప్రేమ నిరాకరించిందని కత్తితో దాడి చేసిన యువకుడు
  • యువతిని ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. పరిస్థితి విషమం

హైదరాబాద్ లోని ఛత్రినాకలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమ నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేసి, కత్తితో గొంతు కోశాడు. యువతి అరుపులతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రాగా.. నిందితుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్పారు. 

ప్రత్యక్ష సాక్షుల వివరాలు, సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ఘటనా స్థలానికి దగ్గర్లోనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, యువతికి ఇప్పటికే పెళ్లి అయిందని, భర్తతో విడాకులు తీసుకుని తల్లితో కలిసి ఉంటోందని చుట్టుపక్కల వారు చెప్పారు. ఉదయమే తల్లి షాపుకు వెళ్లగా.. బాధితురాలు ఆఫీసుకు వెళ్లేందుకు తయారవుతోందని వివరించారు.

Women Stabbed
Hyderabad
Chatrinaka
Love Affair

More Telugu News