Ayyanna Patrudu: ఏపీ శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు.. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Chintkayala Ayyanna Patrudu To Be AP Assembly Speaker
  • సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి వైపే అధిష్ఠానం మొగ్గు
  • డిప్యూటీ స్పీకర్ రేసులో జనసేన నేతలు లోకం మాధవి, పంతం నానాజీ!
  • చీఫ్‌విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు చాన్స్!
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరు దాదాపు ఖరారైంది. సీనియర్ నేత అయిన ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. ఉపసభాపతి పదవిని జనసేనకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు లోకం మాధవి, పంతం నానాజీ రేసులో ఉన్నట్టు సమాచారం. చీఫ్‌విప్‌గా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు వినిపిస్తోంది.

ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేస్తారు. అలాగే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఎన్నుకుంటారు. టీడీపీ మరో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు అంటే 22న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఉంటుంది.
Ayyanna Patrudu
Dhulipala Narendra Kumar
AP Speaker
Chandrababu
Telugudesam
AP Assembly

More Telugu News