Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు 'వై' ప్లస్ సెక్యూరిటీ
![Y Plus Security Allotted to Pawan Kalyan](https://imgd.ap7am.com/thumbnail/cr-20240618tn66710e57b4bf0.jpg)
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచిన ప్రభుత్వం
- వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయింపు
- రేపు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పవన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా, ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపడతారు.
ఇక సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సోమవారం ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు.
కాగా, చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.